Posted on 2025-03-23 03:07:35
ప్రపంచ నీటి దినోత్సవం
•సాంప్రదాయ వనరులను సంరక్షించుకోవాలి
•దాన్ ఫౌండేషన్ ఐటిసి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా; కొత్తగూడెం విద్యానగర్ కాలనీ లో హనుమాన్ సదన్ ఫంక్షన్ హాల్ నందు ధాన్ ఫౌండేషన్ నిర్వహణలో (ఐటిసి) ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి వి బాబురావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం కృషి విజ్ఞాన కేంద్రం (కె.వి.కె) ప్రోగ్రాం అధికారి వి లక్ష్మీనారాయణమ్మ మరియు డాన్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ ఎన్ వినయ్ కుమార్ పాల్గొనడం జరిగింది
వినయ్ కుమార్ మాట్లాడుతూ ఐటిసి ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం ఏడు మండలాలలో సుమారు 12 వందలకు పైగా నీటి కుంటలను తవ్వించడం జరిగినది వాటిద్వారా సుమారు గా వర్షపు నీటిని పది కోట్ల లీటర్ల నీటిని వడిచిపెట్టడం జరిగింది జలాలను కాలుష్యం కాకుండా సంరక్షించుకోవాలి ఉపరితల జలాలను రక్షించుకుంటూ పొదుపుగా వాడుకోవాలి ఇంకుడు గుంటలు తవ్వి జల సంరక్షణ చేసుకోవాలి వర్షపు నీటి సంరక్షణకై నిర్మాణాలు చేపట్టి మొక్కలను పెంచుతూ పచ్చదనాన్ని పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షిస్తూ భావితరాల భవిష్యత్ కోసం నీటిని పొదుపు చేయాలి సాంప్రదాయ వనరులైన చెరువులు కుంటలు చెక్ డాములు బోరు బావులు మొదలైన వాటిని రక్షించుకోవాలి తరువాత కె వి కె. లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ నీటిని సంరక్షించ వలసింది పోయి వృధా చేస్తున్నారని వరిలో దాదాపు ఎక్కువ నీటిని వినియోగించి పండిస్తున్నారని ఆ రకంగా పండించడం వల్ల నీటి వృధా అవ్వడమే కాక రాబోయే తరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది టెక్నాలజీ ఎంత పెరిగిన దానిని వినియోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించుటకు ప్రయత్నించట్లేదని చెప్పడం జరిగింది తక్కువ నీటితో వరిని పండించుటకు ప్రయత్నాలు చేయాలని చెప్పారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి వి బాబురావు మాట్లాడుతూ బోరు బావి ఉన్న ప్రతి రైతు చేలోను ఇండ్లలోను ఇంకుడు గుంతలు తవించుకోవాలని చేలో తీసిన ఇంకుడు గుంతల కట్టల మీద మునగ చెట్లు పెంచుకోవడం వల్ల ఆదాయం వస్తుందని అదే ఇంకుడు గుంటలో చేపలు వేసుకోవడం వల్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని ఇది ప్రతి రైతు పాటించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ధాన్ ఫౌండేషన్ సిబ్బంది రైతులు మహిళలు వయలగా సంఘం లీడర్లు పాల్గొన్నారు.
వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
Posted On 2025-04-20 15:02:56
Readmore >నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
Posted On 2025-04-19 19:00:32
Readmore >బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్
Posted On 2025-04-19 18:21:12
Readmore >జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు
Posted On 2025-04-19 16:29:52
Readmore >