| Daily భారత్
Logo




లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

News

Posted on 2025-03-22 04:54:50

Share: Share


లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ప్రవేట్ హాస్పటల్‌లో మహిళ మృతి

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనమారి కృష్ణపురానికి చెందిన సత్తు సరోజిని (55) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రసూన ఆర్థోపెడిక్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స తర్వాత ఆ మహిళను స్ట్రెచర్‌పై లిఫ్ట్‌లోకి తరలించారు. రోగి, ఇద్దరు వార్డు బాలురు లిఫ్ట్‌లోకి ప్రవేశించగానే, సాంకేతిక లోపం కారణంగా తలుపులు మూసేలోపు అది కదిలింది. స్ట్రెచర్ లిఫ్ట్ తలుపులలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ మూడవ అంతస్తుకు వెళ్లి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

మీది అంతస్తుకు వెళ్లాల్సిన లిఫ్ట్‌ సాంకేతిక సమస్య కారణంగా ఆకస్మాత్తుగా, అతివేగంగా కిందికి పడిపోయి నేలకు ఢీకొట్టడంతో అందులోని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టులో స్ట్రెచర్‌పై ఉన్న ఆమె దానిపైనే కన్నుమూసింది. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రసూన ఆస్పత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వనంవారి కిష్టాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజిని(63)కి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ఈ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు యాంజియోగ్రామ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. తిరిగి శుక్రవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన సరోజినికి మళ్లీ పరీక్షలు నిర్వహించి స్టంట్‌ వేయాలని చెప్పారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో విజయవంతంగా స్టంట్‌ వేశారు.

ఆపరేషన్‌ అనంతరం ఆమెను థియేటర్‌ ఉన్న రెండో అంతస్తు నుంచి ఐసీయూ వార్డు (నాలుగో అంతస్తు)కి తరలించేందుకు స్ట్రెచర్‌పై పడుకోబెట్టి లిఫ్ట్‌లోకి తీసుకువచ్చారు. ఆమె వెంట ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. లిఫ్ట్‌లో బటన్‌ను నొక్కగానే పైకి వెళ్లడానికి బదులు, ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండో ఫ్లోర్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పడిపోయింది. దీంతో స్ట్రెచర్‌పె ఉన్న సరోజిని లిఫ్ట్‌లోనే ప్రాణం విడిచింది. ఆమెతో పాటు ఉన్న ఆస్పత్రి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. లిఫ్ట్‌ సెన్సర్లు పనిచేయక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఈ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈనెల 7నే తగిన మరమ్మతులు చేయించినట్లు ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయినప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుబట్టడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సరోజిని మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు.

Image 1

వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలి : TPTF రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్

Posted On 2025-04-20 15:02:56

Readmore >
Image 1

తిరుమల రెండో ఘాట్ వద్ద కారులో చెలరేగిన మంటలు

Posted On 2025-04-20 08:49:03

Readmore >
Image 1

నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

Posted On 2025-04-19 19:00:32

Readmore >
Image 1

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

Posted On 2025-04-19 18:24:52

Readmore >
Image 1

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

Posted On 2025-04-19 18:23:45

Readmore >
Image 1

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

Posted On 2025-04-19 18:21:12

Readmore >
Image 1

జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు

Posted On 2025-04-19 16:29:52

Readmore >
Image 1

ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Posted On 2025-04-19 15:58:50

Readmore >
Image 1

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. నలుగురి మృతి

Posted On 2025-04-19 07:22:41

Readmore >
Image 1

అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

Posted On 2025-04-19 07:16:05

Readmore >