| Daily భారత్
Logo




ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు

News

Posted on 2025-03-21 18:08:13

Share: Share


ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు

డైలీ భారత్, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్   లో శుక్రవారం నాడు ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అధిపతులు  శ్రీమతి లీలా సౌమ్య మరియు భాను ప్రవీణ్   మాట్లాడుతూ   కవిత్వం మన భావోద్వేగాలను,అను భావాలను, ఆనందాన్ని మరియు బాధలను అందంగా వ్యక్తపరిచే  అత్యంత సృజనాత్మకమైన రూపమని, కవిత్వం నిజ జీవితానికి ప్రాణం పోసే ఒక సాహిత్య ప్రక్రియ అని అన్నారు. షేక్స్పియర్, జాన్ కీట్స్, వర్డ్స్ వర్త్, టెన్నిసన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆర్ కె నారాయణ్, రాజారావు వంటి రచయితలు తమ రచనలలో జీవితం ప్రకృతి ప్రేమ మతం మానవత్వం భగవంతుడు స్వేచ్ఛ  వంటి విషయాలను గూర్చి సృజనాత్మకంగా  వివరించారని  పేర్కొన్నారు. అధ్యక్ష ఉపన్యాసంలో  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మ ఆంగ్ల భాష ప్రాధాన్యతను, ఉపాధి అవకాశాలను గూర్చి వివరిస్తూ, ఆంగ్ల విభాగ అధిపతులు రచించిన ఆంగ్ల కవితా సంపుటిని ఆవిష్కరించి అభినందించినారు.అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థులు పి పి టి ద్వారా ఆంగ్ల కవుల జీవితాలను, రచనలను  మరియు రాగయుక్తంగా  ఆంగ్ల కవితలు ఆలపించిన విధానం ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షించినవి. ఆంగ్ల విభాగం అధిపతులు విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసినారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

తిరుమల రెండో ఘాట్ వద్ద కారులో చెలరేగిన మంటలు

Posted On 2025-04-20 08:49:03

Readmore >
Image 1

నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

Posted On 2025-04-19 19:00:32

Readmore >
Image 1

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

Posted On 2025-04-19 18:24:52

Readmore >
Image 1

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

Posted On 2025-04-19 18:23:45

Readmore >
Image 1

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

Posted On 2025-04-19 18:21:12

Readmore >
Image 1

జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు

Posted On 2025-04-19 16:29:52

Readmore >
Image 1

ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Posted On 2025-04-19 15:58:50

Readmore >
Image 1

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. నలుగురి మృతి

Posted On 2025-04-19 07:22:41

Readmore >
Image 1

అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

Posted On 2025-04-19 07:16:05

Readmore >
Image 1

సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310

Posted On 2025-04-19 07:14:31

Readmore >