Posted on 2025-02-26 12:55:56
CEIR పోర్టల్ ద్వారా భాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీస్ అధికారులు,సిబ్బందిని ప్రశంసించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెంజిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు.జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో CEIR పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు.గత రెండు నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 170 మంది భాధితులకు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తిరిగి వారి ఫోన్లను అప్పగించడం జరిగింది.మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. కావున ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా,పోగొట్టుకున్నా వెంటనే CEIR పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్లను పొందవచ్చునని తెలిపారు.పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్ వివరాలను పొందుపరిచి ఫిర్యాదు చేయగలిగితే అట్టి ఫోన్లను సులభంగా కనిపెట్టవచ్చని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే అట్టి మొబైల్ ను ట్రేస్ చేయగలమని అన్నారు.ఈ సందర్భంగా బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజు రెడ్డి మరియు ఐటి సెల్ సభ్యులు విజయ్,నవీన్,మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >