| Daily భారత్
Logo




బీఆర్ఎస్ శ్రేణులపై కేసీఆర్ అసహనం

News

Posted on 2025-02-19 13:44:53

Share: Share


బీఆర్ఎస్ శ్రేణులపై కేసీఆర్ అసహనం

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులపై అసహనం ప్రదర్శించారు. ఏడునెలల సుధీర్ఘ విరామం తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్న విషయం తెలిసిందే.

పార్టీ స్థాపించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నేడు నేతలతో తెలంగాణ భవన్లో చర్చించనున్నారు. కాగా కేసీఆర్ తెలంగాణ భవన్ కి వస్తారని ముందుగానే తెలియడంతో.. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడటంతో తోపులాట జరిగింది. అలాగే సీఎం.. సీఎం అని భారీ ఎత్తున నినాదాలు చేయడంతో కేసీఆర్ ఒకింత అసహనానికి గురయ్యారు.

మీకు దండం పెడతాను, ఒర్లకండిరా బాబు అని కార్యకర్తలకు విన్నవించినా పరిస్థితి సద్దుమణగలేదు. తోపులాట మధ్యలోనే సెక్యూరిటీ సహాయంతో ఆయన పార్టీ ఆఫీసులోకి అడుగు పెట్టారు. అయితే నేడు జరగనున్న కీలక సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, భారీ బహిరంగ సభ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. అదే విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు, శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >