Posted on 2025-02-17 07:53:49
డైలీ భారత్, సూర్యాపేట జిల్లా: గజ్జల లాగులు కటార్ల విన్యాసాలు, భక్తుల పూనకాల నడుమ లింగ ఓలింగ నామ స్మరణముతో పెద్దగట్టు జాతర మార్మోగిం ది,తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేడు కగా నిర్వహించే లింగమం తుల స్వామి జాతర ఘనం గా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది..
యాదవుల ఆరాధ్య దైవ మైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొన సాగనున్న ఈ మహాజాతర కు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలివచ్చారు.
భక్తులు సంప్రదాయ ఆయు ధాలైన కత్తులు, కటర్లు, డప్పులతో స్వామివారిని ఆరాధిస్తూ గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో పెద్దగట్టు పరిసర ప్రాంతం భక్తిజన సంద్రంలా మారింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు
విజయవాడ నుంచి హైదరా బాద్ వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లించేలా ఏర్పాట్లు చేసారు. ఇక సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని పెద్దగుట్టలో జరిగే లింగమంతుల స్వామి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉందట. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుం ది.
ఈ జాతర మొత్తం ఐదు రోజులపాటు ప్రతిరోజూ ప్రత్యేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తులు తమ ఇళ్లలో గంపలు వెళ్లదీ సి సంప్రదాయ ఆయుధాల తో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. యాదవ పూజారు లు బోనాలు సమర్పించి పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేసి నైవేద్యం సమర్పిస్తారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >