Posted on 2025-02-17 07:55:00
డైలీ భారత్, హైదరాబాద్ : కొత్త వైరస్ లు కొత్త జబ్బు లు ఈ పేరు వింటేనే జనా లు హడలిపోతున్నారు. జీబిఎస్ వ్యాధి సోకిన కేసు లు ఏపీలో భయాందోళన లు కలిగిస్తున్నాయి.
తాజాగా కమలమ్మ అనే ఓ 50ఏళ్ల మహిళ ఓ జబ్బు తో మరణించింది. దీంతో జనంలో మరింత భయం పెరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు చెప్పారు.
రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఇమే కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రజలను అప్రమత్త చేయడంతో పాటు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.
ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 17 మందిలో ఈ వ్యాధి లక్షణా లు ఉన్నట్లు గుర్తించగా.. గుంటూరు జీజీహెచ్ లోనే ఏడుగురు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జీజీహెచ్ కు కమలమ్మను తీసుకువచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి న వైద్యులు ఇది జీబీఎస్ గా నిర్థారించారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు మరె వరిలో లేవని తేల్చారు. ఓ పక్క కోళ్లలో వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లో నూ గుర్తించారు.
ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయట పడింది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈభయాం దోళనలో ఉండగానే మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర భయాందోళ నకు గురిచేస్తోంది. ఏపీకి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది.
ఇటీవల ఇది తెలంగాణ లోనూ ప్రవేశించింది. ఏపీలో ఏకంగా మొదటి మరణానికి కారణమైంది.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >