| Daily భారత్
Logo




కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ బర్త్ డే విషెస్.. !

News

Posted on 2025-02-17 07:51:46

Share: Share


కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ బర్త్ డే విషెస్.. !

డైలీ భారత్, హైదరాబాద్ డెస్క్; నేడు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు. 70 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 71 లోకి అడుగుపెడుతున్నారు. కేసీఆర్ జన్మదినం సదర్భంగా బర్త్ డే వేడుకలను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లాన్ చేస్తున్నాయి. ఇక పలువురు ప్రముఖులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రత్యేకంగా ట్వీట్ చేసారు. గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షింస్తున్నా. అని సీఎం రేవంత్ పేరుతో సీఎంవో అధికారులు ట్వీట్ చేశారు.

దేశ విదేశాల్లోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, అడిలైడ్, బ్రిస్బెన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పలువురు అభిమానులు అమెరికాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఆదివారం పంజాగుట్ట జలగం వెంగళ రావు పార్కులో 40 మంది మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారం ద్వారా, నూతనంగా ఏర్పడిన తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చామని తెలిపారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >