| Daily భారత్
Logo




హ్యాపీ బర్త్ డే : తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం కేసీఆర్ !

News

Posted on 2025-02-17 05:36:19

Share: Share


హ్యాపీ బర్త్ డే : తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం కేసీఆర్ !

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: కేసీఆర్.. ఈ మూడు అక్రరాలకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ మన కళ్ల ముందు ఉందంటే దానికి కారణం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రం భావన…పెరిగిపోయి ఇక ప్రత్యేక రాష్ట్రం అన్నది అసాధ్యం అన్న వాతావరణంలోఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని సొంత పార్టీ పెట్టుకున్నారు. సాహసోపేతమైన రాజకీయ అడుగు. ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీని పెట్టారని అంతే తప్ప.. తెలంగాణ కోసం కాదని కొంత మంది వాదిస్తారు. అందులో ఎంత నిజముందో కానీ ఆయన ఆ పార్టీ పెట్టడం వల్లనే ఈ రోజు తెలంగాణ అనే స్వప్నం సాకారం అయింది.

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది క్లిష్టమైన విషయం. అయినా ఎక్కడా దారి తప్పకుండా పోరాటం చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్ర భావన పెంచేలా ఎప్పటికప్పుడు ఉపఎన్నికలతో రాజకీయాలు చేశారు. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తిన్నారు కానీ ఆయన ఎప్పుడూ వెనుకబడిపోలేదు. ఓ సందర్బంగా రాజశేఖర్ రెడ్డి రాజకీయంతో పార్టీ ఆయన చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదంలో పడింది.కానీ ఆ తర్వాత రెండు నెలల్లనే ఉద్యమం ఆకాశమంత స్థాయికి తీసుకెళ్లారు. ఆమరణదీక్ష ప్రకటన తర్వాత కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయక తప్పలేదు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపుగా పదేళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. దశాబ్దాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించారు. తెలంగాణలోఎంతో దిగువన ప్రవహించే గోదావరిని ఎత్తిపోసుకవడానికి అన్ని చోట్లకు తరలించడానికి కాళేశ్వరం నిర్వహించారు. అదే కాళేశ్వరం ఇవాళ ప్లాన్ చేయాలంటే కనీసం ఐదు లక్షల కోట్లు అవుతుంది. ఇక పదేళ్ల కాలంలో హైదరాబాద్ రూపరేఖలు మారిపోయాయి. విదేశీ నగరాల లుక్ వచ్చింది. పాలన విషయంలో…అభివృద్ధి విషయంలో కేసీఆర్ ది వంక పెట్టలేని పాలన అందించారు.

కేసీఆర్ అన్నింటిలోనూ వందకు వంద శాతం పర్ ఫెక్ట్ కాకపోవచ్చు. అలా ప్రతి విషయంలోనూ నూటికి నూరుశాతం కరెక్ట్ గా ఉండేవారు ఉండరు. ఆయన కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. రాజకీయాల్లో ఓటమిని ఓ రాజకీయ నాయకుడి వైఫల్యంగా చెప్పలేం. గత ఎన్నికల్లో కేసీఆర్..బీఆర్ఎస్ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల జరిగి ఉండవచ్చు కానీ.. ఈ కారణంగా ఆయన సాధించిన విజయాలను.. తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని తక్కువ చేయలేం. కేసీఆర్ కొడితే గట్టిగా కొట్టడం అలవాటని ఇటీవల చెప్పుకున్నారు. మరోసారి ప్రత్యర్థుల్ని ఆయన అలా కొట్టలేరని అనుకోలేం. అయితే కొట్టినా కొట్టకపోయినా కేసీఆర్ కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అథ్యాయం ఎప్పటికీ ఉంటుంది.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >