| Daily భారత్
Logo




భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు : హైకోర్టు సంచలన తీర్పు

News

Posted on 2025-02-17 03:30:43

Share: Share


భార్య వేరే వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు :  హైకోర్టు సంచలన తీర్పు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వివాహేతర సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త కాకుండా, మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్ మేరకు ఈ విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భార్యతో వేరుగా ఉంటూ ఆమెకు భరణం అందజేస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తుందని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ కారణం చేత ఆమెకు భరణం పొందే హక్కు లేదని కోర్టులో వాదించాడు. అయితే, భావోద్వేగ ప్రమేయం వివాహేతర సంబంధం కిందకు రాదని కోర్టు అతడి పిటిషన్‌ని కొట్టివేసింది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని తీర్పునిచ్చింది. దీంతో కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు.

ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (BNSS) సెక్షన్ 144(5), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌‌లోని (CrPC) సెక్షన్‌లను 125(4) ప్రస్తావిస్తూ భార్యకు అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని చెప్పింది. అయితే, శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు ఎఫైర్ ఉందనే ఆరోపణలను నిలబడవని కోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ప్రేమించడాన్ని తప్పుగా పరిగణించలేమని చెప్పింది. భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు చట్ట ప్రకారం భరణం నెలకు రూ.4000 ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తూ భర్త పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >