Posted on 2025-02-10 06:30:47
ఏపీలో మరో దారుణం.. ఏడో తరగతి విద్యార్థినిపై..
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ డెస్క్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన వెలుగు చూసిన గంటల వ్యవధిలోనే మరో దారుణం వెలుగు చూసింది. నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి చిన్నారిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిన్నారిని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి ఒడికట్టాడు కామాంధుడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. విద్యార్థిని కడుపునొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాన్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదే పాఠశాలలో గతంలోనూ పలువురు విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. వరస సంఘటనలతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్ బాలికపై ఓ యువకుడితో పాటు ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. గత నెల 29న ఆటో డ్రైవర్ సునీల్ బాలికను స్కూల్కు ఆటోలో తీసుకెళ్తుండగా.. సతీష్ బైక్తో అనుసరించాడు. దారిలో బాలికకు వాంతి కాగా.. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని సతీష్ బైక్పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలికపై లైంగికదాడి చేశాడు. సాయంత్రం స్కూల్కి తీసుకొచ్చి పాఠశాల ఆటోలో ఎక్కించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సునీల్ కూడా బెదిరించి లైంగికదాడతికి ఒడిగట్టాడు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >