Posted on 2025-02-10 06:10:26
డైలీ భారత్ హైదరాబాద్రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట ముక్కుపచ్చలారని పసిపాప నుంచి పండు ముసలి వారిపై కూడా కామాంధులు కన్నేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తిరగబడితే నిర్ధాక్షిణ్యంగా వారి ప్రాణాలను తీసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసలై అభం శుభం తెలియని యువతులను టార్గెట్‌గా చేసుకుని గ్యాంగ్ రేప్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున యువతిపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు (19) పెళ్లీడుకొచ్చిన ఓ కూతురు కూడా ఉంది. అయితే, డ్రైవర్ శివ నరసింహ అనే వ్యక్తి ఆర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. పెళ్లి విషయంలో సాయం చేస్తానంటూ నమ్మించాడు. యువతి అతడిని ప్రతిఘటించడంతో నోరు నొక్కేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శివ నరసింహ పై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >