| Daily భారత్
Logo




పల్లె పోరుకు సిద్ధం..

News

Posted on 2025-02-10 06:35:27

Share: Share


పల్లె పోరుకు సిద్ధం..

బ్యాలెట్ బాక్సులు, సమకూర్చే పనిలో నిమగ్నం..

పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి..

జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు..

సర్పంచ్ గుర్తులు (30).. వార్డు సభ్యుల గుర్తులు (20)

రాష్ట్రంలో 12,848 పంచాయతీలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టటానికి సమయాత్నం అవుతుంది. సిబ్బంది ఎంపిక, వారికి శిక్షణ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల గుర్తులు తదితర అంశాలపై అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులకు గ్రామపంచాయతీ ఎన్నికలలో నిర్వహించాల్సిన విధులను కేటాయించారు. తెలంగాణలో గ్రామాల సంఖ్య పెరగటంతో బ్యాలెట్ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. అందుకే పక్క రాష్ట్రాల నుంచి బాక్సులు తెప్పిస్తున్నారు. అలాగే, గ్రామాలు, వార్డుల వారీగా కావాల్సిన బ్యాలెట్  పత్రాల అవసరాన్ని అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. ఇక, ఎన్నికలలో విధులు నిర్వహించడానికి ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖల ఉద్యోగులను గుర్తించారు. పలుచోట్ల సిబ్బందికి శిక్షణ కొనసాగుతుంది. ఇక, ఎన్నికల పనిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. 

పంచాయతీ గుర్తులు ఇవే..

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తుల పై తుది కసరత్తు పూర్తయింది. సర్పంచ్ అభ్యర్థులకు ( 30) గుర్తులు, వార్డు సభ్యులకు (20) గుర్తులను ఆమోదించినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఇవే గుర్తులు ఖరారయ్యే అవకాశం ఉంది. 

సర్పంచ్ గుర్తులు:

ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయ, కొబ్బరికాయ, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్రికెట్ బ్యాటర్, పడవ, బిస్కెట్, పిల్లనగ్రోవి, చైను, చెప్పులు, బెలూన్, క్రికెట్ వికెట్లు.

వార్డు సభ్యుల గుర్తులు:

గౌను, గ్యాస్ స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్ట్ డబ్బా,  కవర్ సంచి, హాకీ స్టిక్ మరియు బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, చెక్క పెట్టె, విద్యుత్తు స్తంభం, షటిల్, గుర్తులను ఎన్నికల సంఘం గుర్తించారు. 

రిజర్వేషన్ పై ఉత్కంఠ..

రాష్ట్రంలోని పల్లెల్లో ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్ పై హాట్ ట్రాఫిక్ గా మారాయి. సామాజిక వర్గాల వారీగా ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకూలించకుంటే స్థానిక ఎన్నికల వైపు గురి పెడుతున్నారు. పలు పంచాయతీ ఎన్నికలలో సగం దాకా మహిళా రిజర్వేషన్లు ఉండటం పైన తర్జనభర్జన పడుతున్నారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయా గ్రామాల్లో సామాజిక వర్గాల జనాభా శాతం, మహిళల సంఖ్యతో పాటు గతంలో వరుసగా మూడుసార్లు వచ్చిన రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గతసారి వచ్చిన రిజర్వేషన్ ఈసారి మారవచ్చని అంటున్నారు. తమ గ్రామానికి ఫలానా రిజర్వేషన్లు కేటాయించాలని అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. మొత్తంగా ఎన్నికల కోడ్ వెలువడక ముందే రిజర్వేషన్ల అంశం పల్లెల్లో ఉత్కంఠ రేపుతుంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 12,848 గ్రామపంచాయతీలను గుర్తించింది. వీటన్నిటికీ ఎన్నికలు జరగనున్నాయి. దీని ప్రకారం మొత్తం12,848 గ్రామ పంచాయతీలలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 570 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామపంచాయతీలు ఉండగా అక్కడ 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. ఇక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లాలో 19 ఎంపీటీసీ, 03 జెడ్పిటిసి స్థానాలు ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >