Posted on 2025-02-08 14:00:01
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ తొలి సమావేశం నిర్వహించిన చైర్మన్ వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దేశ ప్రగతిలో సింగరేణి పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు.
హైదరాబాద్ లోని అసెంబ్లీ లో ప్రభుత్వ సంస్థల కమిటీ తొలి సమావేశంను శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనర్జీ ప్రిన్సిపుల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యన్.బలరామ్ , తెలంగాణ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్), మాధవి,అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు,కమిటీ సభ్యులు మక్కాన్ సింగ్ ఠాగూర్, సంజీవ రెడ్డి, తాత మధు,మీర్జా రియాజ్ ఉల్ హాసన్ ఎఫెండి, తోట లక్ష్మీ కాంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ...సింగరేణి దేశ, రాష్ట్ర ప్రగతిలో కీలకంగా అని పేర్కొన్నారు.సింగరేణి లాభాల బాటలో పయనిస్తూ అత్యధిక లాభాలను నమోదు చేయటం శుభపరిణామం అని తెలిపారు.గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను కార్మికులకు పంచడం హర్షించదగ్గ విషయం అని పేర్కొన్నారు. సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం డీ.ఎం.ఎఫ్.టీ నిధులను, సి.ఎస్.ఆర్ నిధులను ప్రణాళిక బద్దంగా వాడుకోవాలని చెప్పారు. అలాగే సింగరేణి ఉద్యోగుల కోసం క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు ను పెట్టాలను కోరారు.అలాగే మెడికల్ బోర్డు లో ఉన్న ఖాళీలను నింపాలని కోరారు. అతి త్వరలో సింగరేణి ఏరియాలో ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సందర్శించడం జరుతుందని తెలిపారు. కమిటీ తొలి సమావేశానికి ముందు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ అయిన వీర్లపల్లి శంకర్ అసెంబ్లీలో తమ కార్యాలయంను ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎనర్జీ ప్రిన్సిపుల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యన్.బలరామ్ , తెలంగాణ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్), మాధవి,అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులు ,అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >