| Daily భారత్
Logo




పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు

News

Posted on 2025-02-08 01:18:01

Share: Share


పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం

డైలీ భారత్, డెస్క్ :  తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించి నేడు మూడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఫైనల్ వంటి కీలక పనులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.ఫ్రీ సింబల్స్ ప్రకటన..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ను కేటాయించింది. ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసే వారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. వారికి ఈ గుర్తులనుకేటాయిస్తారు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేసి వారికి కేటాయిస్తారు. నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్కు చేయి గుర్తు, బీజేపీకి కమలం పువ్వు, ఆమ్ ఆద్మీ కి చీపురు, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, గుర్తింపు పొందిన కేటగిరిలో ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్గుర్తులు కేటాయించారు. రిజిష్ట్రర్డ్పార్టీల గుర్తుల్లో జనసేకు గాజు గ్లాసు, సీపీఐకి కంకి కొడవలి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్పార్టీ కి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిష్ట్రర్డ్పార్టీలుగా నమోదు అయి సింబల్కేటాయించని పార్టీలు 66 ఉన్నాయి.ఫ్రీ సింబల్స్ఇవే...ఎయిర్ కండిషనర్, ఆపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్బోర్డు, చపాతీ రోలర్, కోటు, ఫుట్ బాల్ ఆటగాడు ఇలా మొత్తం 30 సింబల్స్ను ఫ్రీ సింబల్స్గా ఎన్నికల సంఘం ప్రకటించింది.15 వరకు ఆర్వోలకు శిక్షణ.ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్అధికారులు, పోలింగ్సిబ్బందిని ఈనెల 10వ తేదీ కల్లా ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీవోటీ(ట్రైనర్స్ఆఫ్ట్రైనీస్)ల, మాస్టర్ట్రైనీస్లకు శిక్షణ పూర్తి చేసింది. వీరిలో జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఆ తరువాత అసిస్టెంట్రిటర్నింగ్అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈనెల 12వ తేదీల్లో రిటర్నింగ్అధికారులకు, ఈనెల 15 కల్లా పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.15 వరకు పోలింగ్ కేంద్రాలు ఫైనల్.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈనెల 15కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ప్రతిపాదిక పోలింగ్ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఈ తరువాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని సూచించింది.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >