| Daily భారత్
Logo




ఇక మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు...రుణం ఏకంగా 6 రెట్లు

News

Posted on 2025-02-08 01:17:05

Share: Share


ఇక మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు...రుణం ఏకంగా 6 రెట్లు

దేశంలో 25 నగరాల్లో పురుషుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం

డైలీ భారత్, డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పొదుపు సంఘాలుగా పేరుగాంచిన డ్వాక్రా సంఘాల గురించి అందరికీ తెలుసు. కనీస సంఖ్యలో మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడిన వారికి బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. ఆ మొత్తాలను తిరిగి అతి తక్కువ వడ్డీతో, వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. కష్టకాలంలో ఉన్న పేదలకు ఈ రుణాలు ఎంతో ఆసరాగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ స్వయం సహాయక సంఘాలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం. మహిళలు మాత్రమే వీటిల్లో సభ్యులుగా ఉండే అర్హత ఉంది. అయితే, ఇప్పుడు పురుషులకు కూడా ఇలాంటి సంఘాలు రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్లో ఏపీలో :పురుషులకు సంబంధించిన ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయవాడలో సుమారు 3 వేల సంఘాలను రాబోయే ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఎప్పుడో మొదలయ్యాయి. గడిచిన నెల రోజుల్లో 100 సంఘాలను ఏర్పాటు చేశారు. వచ్చేనెల (మార్చి) ముగిసేలోగా మిగిలిన 2 వేల సంఘాలను సిద్ధం చేయబోతున్నారు.

కేంద్ర "మిషన్"లో భాగంగా :జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్‌ (NULM) 2.0లో భాగంగా, దేశం మొత్తం మీద 25 నగరాల్లో ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా చూసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు తరలిపోతున్న కూలీలకు ఆర్థిక భరోసా అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల నుండి ఇప్పించే రుణాల ద్వారా, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడతాయని అంచనా వేస్తోంది.ఈ సంఘాల్లో సభ్యత్వానికి వీరే అర్హులు :

భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులుతోపుడుబండ్లు, ఆటో, రిక్షా కార్మికులుఆహారం, నిత్యావసరాలు, కూరగాయలు సరఫరా చేసే కార్మికులు. (స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల్లో పనిచేసేవారు)వీధుల్లో చెత్త సేకరించే వారువృద్ధులు, ఇళ్లలో పని చేసేవారు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు

రుణ మంజూరు ఇలా :

ప్రతి సంఘంలోనూ గరిష్ఠంగా ఐదుగురు సభ్యులకు అవకాశం.ప్రతినెలా సమావేశం కావాలి. ప్రతి సభ్యుడూ కనీసం రూ.100 పొదుపు చేయాలి.మూడు మాసాల తర్వాత ఎంత మొత్తం పొదుపు చేశారో, దానిపై ఆరు రెట్లు (లేదా) రూ. 1.50 లక్షల రుణం బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇందులో ఏది ఎక్కువైతే దాన్ని అందిస్తారు.ఈ మొత్తాన్ని తమ కుటుంబ, వృత్తి అవసరాలకోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకోవచ్చు. సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే, అదనపు రుణం మంజూరు అవుతుంది.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >