Posted on 2025-02-05 17:40:35
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్ డెస్క్:ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్తారు. అరైల్ ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు.
తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయా గ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయల్దేరుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక జనవరి 13న ప్రారం భమైన మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరా త్రి రోజున ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >