| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు : తప్పిన పెను ప్రమాదం

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు : తప్పిన పెను ప్రమాదం

డైలీ భారత్, గుంతకల్:గుంతకల్లు రైల్వే స్టేషన్ యార్డులో సౌత్ క్యాబిన్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

జిందాల్ నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 వ్యాగన్ లు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 

రెండు వ్యాగన్లు పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. 

ఈ గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో ప్రశాంతి ఎక్సప్రెస్ రైలు ను తిమ్మనచెర్ల లో నిలిపివేశారు. అదే విధంగా హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును బైపాస్ మీదుగా మళ్లించారు. 

మంగళవారం రాత్రి రావాల్సిన వారణాసి రైలు, గుత్తి, విజయవాడలకు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

గత వారం రోజులకు క్రితం కూడా గుంతకల్ రైల్వే జంక్షన్ లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనపై సంబంధిత రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Previous ప్రయాగ్ రాజ్ లో ప్రధాని నరేంద్ర మోడీ, పుణ్య స్నానం
Next జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష
ADVERTISEMENT