Posted on 2025-02-05 17:39:34
మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్న మేరకు తమకు అన్యాయం జరిగిందని మాలలు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి.సుధాకర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కొప్పరి.నవతన్ అధ్యక్షత వహించగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పూర్తిగా మాలలను మోసం చేయడమేనని,కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాపాడుతుందని మాలలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే, తమ గొంతే కోస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పని పాట లేనట్టు పిల్లి తలకొరుగుతున్నాడని ఎద్దేవా చేయడం జరిగింది. మాలలు మోసం చేసి అసెంబ్లీలో జన్మ ధన్యమైంది అని చెప్పి మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి,ఆయన ఇచ్చిన 420 హామీలను నెరవేర్చి ఆయన జన్మను ధాన్యం చేసుకోవాలి కానీ, ప్రజలను మోసం చేసి,నమ్మిన మాలలు గొంతు కోసి జన్మ ధన్యమైంది అంటే సరికాదని,అది నీ జన్మ దహనమైనట్టు అని,రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదయడమే అజెండాగా మాల మహానాడు పనిచేస్తుందని, తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడవట్లేదని బిజెపి మనువాద పార్టీ మోడీ కనుషన్నల్లో నడిచే బిజెపి ప్రభుత్వం నడుస్తుందని ఇకనైనా రేవంత్ రెడ్డి పందా మార్చుకోకపోతే ,తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అధః పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడిపల్లి.శ్రీకాంత్, పి.ఎన్.మూర్తి,వాసుమల్ల. గౌతమ్, బద్దం.రాహుల్, దాసరి. అశోక్,పండగ.రాజేశ్వరరావు, గంధం.కల్పన, బద్దం.స్వర్ణలత తదితర మాల మహా నాయకులు పాల్గొన్నారు.
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >