Posted on 2025-02-05 13:39:18
హాస్టల్స్ లోని స్టోర్ రూమ్, కిచెన్ గది క్లీన్ గా ఉండాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్లమహాత్మా జ్యోతి భాపులే విద్యాలయంలోని స్టోర్ రూమ్, కిచెన్ గది నిత్యం క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతి భాపులే విద్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, వసతి గదులు, స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు.
ఆహార పదార్థాలు నిల్వ చేసే, అలాగే సిద్ధం చేసే గదులు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం 7 వ, 8వ తరగతి సిలబస్ ఎంతమేరకు పూర్తి అయింది ఆరా తీశారు.
అన్ని తరగతుల సిలబస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అన్ని తరగతుల విద్యార్థులతో నిత్యం ఆయా పాఠ్యాంశాలు చదివించాలని, రాయించాలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనాథ్, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >