Posted on 2025-02-05 07:21:52
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పోలింగ్ మొదలైంది
ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించను న్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా రు. అదే సమయంలో, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది.
ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకోనున్నారు. వాటిలో3 వేలకు పోలింగ్ సెంటర్లను సమస్యాత్మకమైవనిగా గుర్తించి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు.
ఒకవైపు ఢిల్లీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంటే, పొద్దున్నే పూజల సందడి కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ యమునా ఘాట్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా పూజలు చేశారు.
కల్కాజీలోని ఒక ఆలయంలో సిసోడియా పూజలు నిర్వహించారు. ఇక, ఎన్నికల నేపథ్యంలో అయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిం చారు అధికారులు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >