Posted on 2023-08-29 10:43:05
హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది. లేటెస్ట్‌గా దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది..
ఇక.. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ని ప్రభుత్వం విడుదల చేసింది.
వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొంది
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >