Posted on 2024-11-04 06:29:28
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లాలో మరోసారి ప్రేమోన్మాది ఘటన వెలుగుచూసింది. డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజికి వచ్చిన ఓ యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
అప్రమత్తమైన యువతి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. యువతి చేతికి తీవ్ర గాయం కాగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు చేతన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >