| Daily భారత్
Logo




పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్‌

News

Posted on 2024-11-03 14:14:04

Share: Share


పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్‌

డైలీ భారత్, హైదరాబాద్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో మరోసారి ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తారని మండిపడ్డారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తున్నదని చెప్పారు.

పోరాటం తెలంగాణకు కొత్తకాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉన్నదని తెలిపారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని, ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని చెప్పారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా, 13 జిల్లాల్లో అధికారికంగా, 20కిపైగా జిల్లాల్లో అనధికారికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పోరాడి సాధించుకొని..

పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..

ప్రజాస్వామిక తెలంగాణలో..

మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..

ఇందిరమ్మ రాజ్యంలో

ప్రశ్నిస్తే కేసులు…

హక్కులను అడిగితే బెదిరింపులు..

పోరాడితే సస్పెన్షన్లు…

ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..

పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..

ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం..

ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం.’’

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >