Posted on 2024-10-22 20:02:13
ఇక పార్టీలో ఉండలేను
అధికారంలోకి వచ్చామని సంతోషించాల
దాడులు జరుగుతున్నాయని బాధపడాలా
డైలీ భారత్, జగిత్యాల: మీకో దండం..మీ పార్టీ కో దండం.. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కుడి భుజంలా భావించే మారు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆందోళన చెందారు. హత్యను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషించాలా… మాపై దాడులు జరిగి, హత్యలు జరగడంతో బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్య జరగడం అంటే తనపై దాడి జరిగినట్లేనని వాపోయారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలకు కూడా రక్షణ లేకపోతే పార్టీని ఎలా కాపాడతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడగా.. నాలుగు దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తే మంచి బహుమతి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >