Posted on 2024-10-22 18:58:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంకాకర్ల నుండి నర్సాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా దట్టంగా చెట్లు పెరిగి రోడ్డును కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకంతో పాటు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండడంతో అప్రమత్తమైన కాకర్ల ఆటో కార్మికులు అందరూ కలిసి మంగళవారం స్వచ్ఛందంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగిస్తున్నారు. వారు మాట్లాడుతూ దట్టమైన పొదలతో రోడ్డంతా కమ్ముకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో , ఆటోలన్నీ నిలిపి అందరం కలిసి స్వచ్ఛందంగా రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగిస్తున్నామని తెలిపారు. వీరి శ్రమదాన ఫలితాన్ని చూసిన పలువురు వాహనదారులు అభినందనలు తెలిపారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >