Posted on 2024-10-03 17:23:57
కాంగ్రెస్ యువనేత అందేమోహన్, సౌమ్య దంపతుల ప్రత్యేక పూజలు
మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శరన్నవరాత్రి ఉత్సవాలు షాద్ నగర్ పట్టణంలోని అత్యంత ప్రాచీన గుడి బంగారు మైసమ్మ దేవాలయంలో సంబురంగా ప్రారంభమయ్యాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతే మోహన్ సౌమ్య దంపతులు
తెలిపారు. ప్రతి ఏడాది స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా చేపడుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బంగారు మైసమ్మ ఆలయంలో బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు గురువారం దర్శనం ఇచ్చారని అందే మోహన్ సౌమ్య దంపతులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు అనేక అవతారాళ్లు రాబోయే రోజుల్లో దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. ఆలయంలో మణిశర్మ పురోహితులు వేద మంత్రిచ్చరణల మధ్య బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని భక్తులకు వివరించారు. బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోనే ముఖ్యమైందనీ అందుకే విద్యోపాసకులకి మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారనీ మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీబాలాత్రిపురసుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం అని వివరించారు. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీబాలా త్రిపుర సుందరీ దేవి దర్శనమిస్తారని వారు తెలిపారు..
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >