| Daily భారత్
Logo




హైదరాబాద్ లో డీజేలు, క్రాకర్స్ బంద్..సంచలన ఉత్తర్వులు జారీ

News

Posted on 2024-10-01 19:31:10

Share: Share


హైదరాబాద్ లో డీజేలు, క్రాకర్స్ బంద్..సంచలన ఉత్తర్వులు జారీ

డైలీ భారత్, హైదరాబాద్: పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఇంట్లో అయినా వీధిలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా డీజేల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్‌ మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ ఎటాక్‌ వచ్చి ప్రాణాలు కోల్పోతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో డీజేలు,సౌండ్ మిక్సర్‌లు, హైసౌండ్ ఎక్యూప్‌మెంట్, క్రాకర్లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపులు,వేడుకల్లో ఇకపై వీటిని వాడరాదు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేదం అమల్లో ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు.

కాగా, 4 జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్‌ లో వాడకూడదన్నారు.  డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల మత పెద్దలతో,రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >