Posted on 2024-09-30 23:11:58
డైలీ భారత్, సిరిసిల్ల: మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ సహకారం అవుతున్న వేళ సిరిసిల్లలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు మాదిగ మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ప్రకటించింది.సోమవారం సిరిసిల్ల కే కన్వెన్షన్ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ మాదిగ ఉపకులాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం కత్తెర దేవదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవదాసు మాట్లాడుతూ మాదిగ మాదిగ ఉపకులాల 30 ఏళ్ల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకోబోతున్నామని దీనికోసం మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేసినట్లు తెలిపారు. సిరిసిల్లలో మాదిగ మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో త్వరలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.సుమారు పదివేల మంది మాదిగలతో సభ జరగబోతుందని ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు భారీగా తరలిరావాలని కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొల్లూరి ధర్మేందర్,ఖానాపురం లక్ష్మణ్,ఆవునూరి వెంకట రాములు,గుండా థామస్,ఆవునూరి ప్రభాకర్, గుండేటి రాజు,నేదునూరి లక్ష్మణ్,కొమ్ము బాలయ్య, తాళ్లపల్లి ప్రభాకర్,రాగడి దేవదాసు,బొడ్డు రాములు,గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >