Posted on 2024-09-19 18:30:46
అధికారులు స్పందించి గండి పూడ్చలి
రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( చర్ల మండలం):
చర్ల మండలం లింగాపురం గ్రామం లోని రైతులు రెండు సార్లు వరి నార్లు పోసినారు,నష్ట పోయిన రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తున్నారు, కాలం వెళ్లిన తర్వాత చేసేది లేక విలవిల లాడుతున్న రైతులు, ఒక అడుగు లోతు కూడ నీరు నిలవడం లేదు, చెరువు నీటితో ఇంక వ్యవసాయo చేసేథెలా అగమ్యగోచరంగా నిస్సహాయత స్థితిలో ఉన్న సన్నకారు చిన్నకారు రైతులు, పరిష్కారం ఏమిటి? నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అధికారులకు వత్తిడి కలిగించి చెరువు కట్ట పకడ్బందీగా పోయించే వారు ఎవరూ అని రైతులు అంటున్నారు,ఒకరో ఇద్దరో నడుo కట్టి చేసేది కాదు. దీని పరిష్కారం ఏమిటి? మున్ముందు ఇలాంటి ఇబ్బంది రాకుండా కట్ట దట్టంగా, నీటి ఎద్దడి లేకుండా పంటలు సుభిక్షం గా పండేలాగా ఉన్న ఇరిగేషన్ అధికారులు యోజన చేసి కట్ట కట్టగలరు .
అలుగు కూడా లోతు చేస్తే బాగుంటుంది, అలుగు పూడుకుపోటం చేత పైన నుండి వచ్చే ఐదు చెరువుల నీళ్ళు బొడ్డు కాలువ ద్వారా వచ్చుట చేత ప్రవాహం ఎక్కువై చెరువు కట్ట మీదిగా ప్రవహించి కట్టలు తెంచుతుంది.
గత సంవత్సరం కూడా తెగిపోతే ఓ రైతు పోయించారు.
ఈ సంవత్సరం ఇంకా లోతు గండి పడటం మూలాన రైతుల వలన కావటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం సహకారం చేస్తే బాగుంటుంది, గొలుసుకట్టు విధానం లో నిర్మితమైన ఈ చెరువును ఇరిగేషన్ ఇజనీరులు సర్వే చేసి పటిష్టమైన కట్టను నిర్మిచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >