| Daily భారత్
Logo




సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత..!!

News

Posted on 2024-09-12 13:58:55

Share: Share


సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత..!!

డైలీ భారత్, ఢిల్లీ : ప్రముఖ రాజకీయవేత్త, భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. శ్వాసకోస, ఇతర ఆరోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో ఆయన చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.

ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులు, కల్పకం దంపతులకు 1952 ఆగస్టు 12న చెన్నై లో జన్మించిన సీతారాం ఏచూరి 1974లో ఎస్ఎఫ్ఐ చేరారు. 1975లో సిపిఎం ప్రాధమిక సభ్యుత్వంను తీసుకున్నారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైయ్యారు.

ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి నాయకత్వ స్థానంలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1985లో పన్నెండవ పార్టీ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పి సుందరయ్య, ఇఎంఎస్, బిటిఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య మరియు జ్యోతిబసు వంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేశారు. 1992లో జరిగిన 14వ పార్టీ కాంగ్రెస్ సెషన్‌తో పొలిట్‌బ్యూరోకు చేరుకున్నారు.

మతతత్వం మరియు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఏచూరి క్రమం తప్పకుండా పార్లమెంటులో జోక్యం చేసుకున్నారు. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ముఖ్యమైన నివేదికల తయారీకి ఆయన నాయకత్వం వహించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం, 2004లో మొదటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో ఏచూరి కీలకపాత్ర పోషించారు.

సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్ లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు ప్రారంభించిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లడంతో వాటిని కొనసాగించలేకపోయారు.

భారతీయ రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రజా ఉద్యమాలకు తాత్విక స్పష్టతతో తీర్చిదిద్దే రాజకీయ, సంస్థాగత బాధ్యతను నిర్వర్తించిన నాయకుడు ఏచూరి. ఆయన భార్య ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి సీమా చిస్తీ. బ్రిటన్‌లో యూనివర్సిటీ టీచర్‌గా పనిచేస్తున్న అఖిలా ఏచూరి, జర్నలిస్టు ఆశిష్ ఏచూరిల పిల్లలు.

ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం మరియు బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఏచూరి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర, సోషలిజం ఇన్ ట్వంటీ-ఫస్ట్ సెంచరీ, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం మరియు ఘృనా కీ రాజనీతి (హిందీ) వంటి పుస్తకాలను రచించారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >