Posted on 2026-04-27 15:26:03
డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా షీ టీమ్ బృందం జిల్లా కేంద్రంలో గల ప్రతిభ జూనియర్ కళాశాల, లక్ష్మి పారామెడికల్ కాలేజ్, అంగని వాడి సెంటర్స్ నందు విద్యార్థులకు, పిల్లలకు, మహిళలకు వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందిన గుర్తి కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని డ్రగ్స్ ను నిర్మూలించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని సంబంధించిన సమాచారాన్ని డయల్ 100 కు లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా దుష్ప్రభావాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు వేధింపులకు గురి అయినట్లయితే 100కు సమాచారం ఇవ్వాలని, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన హింసకు గురి చేసిన 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >