| Daily భారత్
Logo




ఏల్బీ నగర్ జోన్ లో హై సిటి ప్రతిపాదనలను పరిశీలించిన కమిషనర్ ఆమ్రపాలి

News

Posted on 2024-09-11 14:24:48

Share: Share


ఏల్బీ నగర్ జోన్ లో హై సిటి ప్రతిపాదనలను పరిశీలించిన కమిషనర్ ఆమ్రపాలి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎల్బీ నగర్ జోన్ లో హై సిటి క్రింద చేపట్టనున్న పనుల ప్రతిపాదనలను జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి బుధవారం ప్రాజెక్ట్ సి.ఈ, ఎస్.ఈ, ఇతర ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ అల్కాపురి జంక్షన్, ఫ్లైఓవర్ ప్రతిపాదన, టి.కె.ఆర్ జంక్షన్ నుండి గాయత్రి నగర్, మంద మల్లమ్మ జంక్షన్ వరకు చేపట్టనున్న  ఫ్లైఓవర్ ప్రతిపాదనలను కమిషనర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో  ప్రతిపాదిత ప్రాజెక్టుల ఆవశ్యకత ను ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్ కమిషనర్ కు వివరించారు.  

ఈ సందర్భంగా కమిషనర్ ఫ్లైఓవర్ అలైన్మెంట్  కు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తదనంతరం ఎల్‌బి నగర్ జంక్షన్‌ను పరిశీలించి,  ఫ్రీ లెఫ్ట్ కు అవసరమైన భూసేకరణ కొరకు  నిర్వహించడానికి టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌లను ఆదేశించారు. బైరామల్‌గూడ  ఆర్ఎచ్ఎస్ లూప్‌ను పరిశీలించి,  సెపరేట్  గ్రేడ్ రోడ్ వర్క్‌ నుండి బైరామల్ గూడ  ఆర్ లూప్‌ పూర్తి కావడానికి ఆస్తుల సేకరణ వేగవంతంగా పూర్తి చేయుటకు  టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయ తో తగు  చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ప్రాజెక్ట్ సి.ఈ దేవానంద్, ఎస్.ఈ, ఈ  ఈ రోహిణి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >