Posted on 2024-09-10 05:54:27
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీమంత్రి సతీమణి మరణించారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి భార్య డాక్టర్ శ్వేత తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి భార్య తీవ్ర అనారోగ్యంతో పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలోనే మరణించినట్లు సమాచారం. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా పలుసార్లు విజయం సాధించారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా లక్ష్మారెడ్డి పనిచేయడం జరిగింది. ఇక లక్ష్మారెడ్డి భార్య మృతి చెందిన నేపథ్యంలో గులాబీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >