Posted on 2024-09-09 18:10:08
డైలీ భారత్, వరంగల్: వరంగల్ మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతి కి అదే గ్రామానికి చెందిన రావిరాకుల నిరంజన్ తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. వీరికి ఇద్దరు పిల్లలు కలరు. ఒక పాప మరియు బాబు. పెళ్లయిన తర్వాత నుంచి మృతురాలి భర్త మరియు అత్త మృతురాలిని కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన భర్త నిరంజన్ వినకుండా వేధించడం మానకపోయేసరికి తేదీ 5.9.2024 రోజు సాయంత్రం మృతురాలు గడ్డి మందు తాగి ఇట్టి విషయాన్ని వారి అమ్మకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా, చికిత్స పొందుతూ స్వాతి ఈరోజు ఉదయం మృతి చెందినది. మృతురాలి తల్లి తలకోట్ల యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎనుమాముల ఇన్స్పెక్టర్ ఏ.రాఘవేందర్ తెలిపారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >