| Daily భారత్
Logo




భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చింది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-09 10:10:53

Share: Share


భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చింది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సంధర్భంగా గ్రామస్తులతో పూజలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గతంలో నెర్రబాలిన నెలలు.. నిండని చెరువులతో మోడుబారిన పల్లెలు.. నేడు గలగల పారేటి గంగమ్మ తల్లితో.. చిగురించాయి మన పల్లెలు అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" చించోడు గ్రామస్తులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండలం చించోడు బ్రహ్మ చెరువు అలుగు నిండిన సందర్భంగా సోమవారం షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ చించోడు విచ్చేయడం జరిగింది. అలుగు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి చెరువు కాపలాదారులు నీరటి వారిని ఘనంగా సన్మానించారు. చెరువుకపలాదారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు అందిస్తామని హామీ ఇచ్చారు. 

భారీగా కురుస్తున్న వర్షాలతో పల్లెలకు జలకల వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తనను గ్రామానికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించినందుకు కార్యకర్తలకు గ్రామస్తులకుఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చించోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మత్ బాబా అలీ,అనంతం, అక్కిగారి శ్రీధర్, మాజీ సర్పంచ్ రేకల శ్రీనివాస్, ఎల్లప్ప, శ్రీధర్ రెడ్డి,  జమాల్పూర్ రాజు, హాజీ పాషా వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >