| Daily భారత్
Logo




"రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి పోపా దిక్సూచి"

News

Posted on 2024-09-08 17:34:17

Share: Share


"రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి పోపా దిక్సూచి"

పోపా ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పోపా ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ భవనంలో పాలిటెక్నిక్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించిన పద్మశాలి టీచర్స్, డాక్టర్స్ మరియు ఆర్గనైజర్స్ కు  సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు హాజరు మాట్లాడినారు. పోపా రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి దిక్సూచిగా పని చేయాలని అన్నారు.

సిరిసిల్ల పోపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్రం అంతటా అమలు చేయదగినవిగా వున్నాయని కొనియాడారు.

పద్మశాలి పేద విద్యార్థుల విద్యాబివృద్ధి కోసం పని చేయడం పోపా ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు.

పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నంచందర్ మాట్లాడుతు ప్రతిభ గల పద్మశాలి విద్యార్థుల ఉన్నత చదువులకు పోపా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. 

పోపా ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి మాట్లాడుతు పద్మశాలి సమాజ హితం కోసం వేసవి సెలవులను సైతం త్యాగం చేసి పాలిటెక్నిక్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హెల్త్ క్యాంపు లను నిర్వహించడం పోపాకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.

మండల విద్యాధికారి దూస రఘుపతి, గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం మాట్లాడుతు విద్య వైద్యం కోసం పోపా సేవలు విస్థరింపజేస్తామని తెలిపారు. పిల్లలకు స్కాలర్షిప్ లు, ప్రతిభ పురస్కారాలతో ప్రోత్సహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నంచందర్, ప్రొఫెసర్ ఆడేపు శ్రీనివాస్, మండల విద్యాధికారి దూస రఘుపతి,గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం,ఉపాధ్యక్షుడు మామిడాల భూపతి, గెంత్యాల భూమేష్, వాసాల హరిప్రసాద్, బొల్లి భగవాన్, కనుకుంట్ల మధు, ఆడేపూ వేణు, ఆడేపు చక్రపాణి, ఆంకారపు జ్ఞనోభ, కొక్కుల శ్రీనివాస్, డాక్టర్ తడుక సాయికుమార్, డాక్టర్ తడుక రవళి, డాక్టర్ సుమంత్ ,బైరీ రవీందర్, చెరాల  తిరుపతి, ప్రభాకర్, బూర శ్రీనివాస్ , సదానందం, చిట్యాల రత్నాకర్ ,రమాదేవి, కనుకుంట్ల తిరుమల, గుండెల్లి కీర్తి, కొడం పూర్ణిమ, శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, గడ్డం సత్యనారాయణ, జక్కని నవీన్, గుండెల్లి రవీందర్, కొడం రాంప్రసాద్, అలువాలా ఈశ్వర్, ఎలగొండ ఆంజనేయులు, లక్ష్మినారాయణ, కృష్ణహరి, గడ్డం శంకర్, మహేషుని లక్ష్మినారాయణ, లకుం సదానందం, చౌకీ చంద్ర శేకర్, తెళ్ళ పూర్ణ చందర్, రాపెల్లి సంతోష్, శ్రీరామ్ అశోక్, దాసరి నాగేశ్వర్, ఒడ్నాల శ్రీనివాస్, గాజంగి తుకారాం, సాయిరాం తదితరులు  పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >