Posted on 2024-09-01 14:06:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక కొత్త ఫ్లైఓవర్లు అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాలను నివారించటానికి ఈ ఫ్లైఓవర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా.. హైదరాబాద్ శివారులో మరో ప్లైఓవర్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలకు వీలుగా సంగారెడ్డి శివారు లింగంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాలకు చెక్ పెట్టాలని జాతీయ రహదారుల సంస్థ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు ఈ ఆ రహదారిపై వంతెన నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తుంది. (NH 65) లింగంపల్లి క్రాస్ రోడ్డుకు సమీపంలో పలు గ్రామాలు ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్డును దాటే క్రమంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లోఏవర్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. తాజాగా రూ.18.50 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.
ఇ ప్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరవాత వంతెన పైనుంచి వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. వంతెన కింద నుంచి సమీపంలోని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. టెండర్లు దాఖలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా సమీప గ్రామాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఇక హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవే నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రహదారి విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ హైవే రెండు వరుసలుగా ఉండగా.. దాన్ని 4 వరుసలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ సందర్శించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నాలుగు వరసల రహదారి అందుబాటులోకి వస్తే ఏపీలోని గుంటూరు, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వెళ్లే వారు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. విజయవాడ హైవేపై కొంత మేర భారం తగ్గనుంది. అలాగే ఈ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ది కూడా చోటు చేసుకుంటుంది.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >