| Daily భారత్
Logo




తెలంగాణ గడ్డపై నామినేషన్ వేయనున్న కార్మిక హక్కుల ఉద్యమ నేత ఆడారి నాగరాజు

News

Posted on 2023-11-08 02:17:53

Share: Share


తెలంగాణ గడ్డపై నామినేషన్ వేయనున్న కార్మిక హక్కుల ఉద్యమ నేత ఆడారి నాగరాజు

డైలీ భారత్, (రంగారెడ్డి): తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మంది మంది నామినేషన్ వేశారు ప్రచారంలో నిమగ్నమయ్యారు అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి కోసం మనం తెలుసుకోవాలి.  16 ఏళ్ల   వయసులోనే కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి 22 సంవత్సరాలు వయసులో నే ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీగా కార్మిక జాతికి సేవలందించారు. ఆ తర్వాత కార్మిక హక్కుల కోసం ఉద్యమించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా అనేక ప్రాంతాల్లో కార్మిక హక్కుల ఉద్యమ నేతగా ఎదిగారు.  తెలంగాణ ప్రభుత్వం అతని సేవలను  పరిశీలించి తెలంగాణ ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రవీంద్ర భారతి లో అందించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బీసీ కమిషనర్ చేతుల మీదుగా ధైర్య సాహసాలకు గరుడ కీర్తి రత్న అవార్డును అందించారు. ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలో తిరుగు లేని రాజకీయ విశ్లేసుడిగా ఎదిగారు. ఎక్కడ ఏ ప్రజా సమస్య కనిపించిన తనదైన శైలిలో ప్రశ్నించడం అతను జీవన శైలిలో ఒక భాగం. ఆడారి నాగరాజు కి కులం మతం ప్రాంతాలకు అతీతంగా శ్రేయోభిలాషులు ఉండడం అందులోనూ  ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయిస్ మరియు అన్ని రాజకీయ పార్టీలోనూ అతని శ్రేయోభిలాషులు ఉండడం

అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. గిరిజన సంఘాలు కార్మిక సంఘాలు బీసీ సంఘాలు ఆడారి నాగరాజు రాజకీయాల్లోకి రావాలని  ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకురావడం గమనార్ధం. ఏది ఏమైనా ఆడారి నాగరాజు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థను మార్పు దిశగా తీసుకువెళ్తారని ఆశిద్దాం

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >