| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: అల్పపీడనం ప్ర‌భావంతో రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపినందున భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు గారు సూచించారు.

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని తెలిపారు

గ్రామాలలో పాత ఇండ్లు,గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి,గోరువెచ్చనినీటిని తాగండి, నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించకండి అని తెలిపారు 

సీజన్ వ్యాధులు సోకకుండా చూసుకోండి...

ముఖ్యంగా రైతులు వ్యవసాయ క్షేత్రంలో పనులకు వెళ్ళినప్పుడు విష సర్పాలు తో జాగ్రత్త ఉండాలని, కాలనీలలో కరెంటు స్తంభాలను తాకవద్దు అని తెలిపారు...

Previous విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం భూమి పూజలో పాల్గొన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Next విశ్వభారతి జూనియర్ కళాశాల కల్చరల్ హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT