| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శరత్ చంద్రబాబు రిటర్మెంట్ సందర్భంగా సన్మానం

శరత్ చంద్రబాబు రిటర్మెంట్ సందర్భంగా సన్మానం

సహృదయ శీలి ఎంపీడీవో దండు శరత్ చంద్రబాబు

మాజీ జెడ్పిటిసి పి. వెంకటరాంరెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నో ఏళ్ల తరబడి ప్రజలకు చక్కని సేవలను అందించి పదవి విరమణ పొందుతున్న బాలానగర్ ఎంపీడీవో దండు శరత్ చంద్రబాబును సహృదయ శీలిగా ఫరూక్ నగర్ మాది జెడ్పిటిసి పి. వెంకట్రాంరెడ్డి కొనియాడారు. 

శనివారం దండు శరత్ చంద్రబాబు పదవి విరమణ సందర్భంగా బాలానగర్ మండల కార్యాలయానికి వెళ్లి ఆయనకు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఆయన వెంట ఎంపీటీసీల సంఘం నాయకులు భీష్మ రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దండు శరత్ చంద్రబాబు విధి నిర్వహణలో ఎలాంటి మచ్చ లేకుండా పూర్తి ఉద్యోగాన్ని చేశారని అన్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు సామాజిక బాధ్యతలతో లయన్స్ క్లబ్ ద్వారా అదేవిధంగా ఆధ్యాత్మిక రీతిలో దేవాలయాలకు విరాళాల రూపంలో ఎన్నో సేవలు చేశారు. ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు భీష్మ రామకృష్ణ మాట్లాడుతూ శరత్ చంద్రబాబు లాంటి అధికారులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు..

Previous ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం భూమి పూజలో పాల్గొన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ADVERTISEMENT