| Daily భారత్
Logo




అభివృద్ధికి రవాణా వనరులే కీలకం:షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-30 16:52:51

Share: Share


అభివృద్ధికి రవాణా వనరులే కీలకం:షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొందూరు చౌదరిగుడా ఉమ్మడి మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా వనరులే కీలకమని లారీల ద్వారా నిత్యం ప్రజా జీవనానికి సహకరిస్తూ ఎంతో సేవ చేస్తున్న లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు గొప్పవని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. నియోజక వర్గంలోని కొందుర్గు, చౌదరిగుడా ఉమ్మడి మండలాలకు సంబంధించిన లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు, కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ సాదిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడా అధ్యక్షులు రాజు, పిఎసిఎస్ చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి, స్టార్ట్ ట్రాన్స్పోర్ట్ అధినేత ఎండి ఖాదర్ గోరి, మాజీ సర్పంచ్ యాదయ్య, యువజన కాంగ్రెస్ నేత పురుషోత్తం రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం రవాణా చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ జనజీవనానికి సహకరిస్తున్న లారీ కార్మికుల సేవలు మరువలేనివని, వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా నూతన లారీ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు సయ్యద్ సాదిక్ ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడుగా ఎండి ఆబేద్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ ఖలీల్, జనరల్ సెక్రెటరీగా షర్ఫుద్దీన్, జాయింట్ సెక్రటరీగా ఆసిఫ్, కోశాధికారిగా ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నర్సింలు నాజీం షఫీ తదితరులు ఎంపికైనట్టు తెలిపారు..

Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >
Image 1

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

Posted On 2026-05-24 10:59:31

Readmore >