Posted on 2024-08-30 16:51:55
ఘనంగా రైతు కాలనీ కోట మైసమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం
వార్షికోత్సవంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నాయకులు, మీడియా ప్రతినిధులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని ఆమె కరుణ కటాక్షాలు అందరిపై ప్రసరిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. శుక్రవారం పట్టణంలోని రైతు కాలనీలో గల కోట మైసమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం కార్యక్రమాన్ని సేవా సమితి, రైతు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, కాంగ్రెస్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, అగనూరు బసవమప్ప, గండ్రాతి బాలరాజు గౌడ్, స్థానిక నేత మురళీమోహన్ అప్పి, కొత్తూరు నేత సుదర్శన్ గౌడ్, కృష్ణారెడ్డి, సింగారం సుదర్శన్, కట్ట వెంకటేష్ గౌడ్, మధురాపురం నేత పుల్లారెడ్డి సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, కెపి, కస్తూరి రంగనాథ్, శరత్, రాఘవేందర్ గౌడ్, కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులను అర్చకులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కోసం తన వంతు ఆర్థిక సాయం గా 11 వేల రూపాయలను కమిటీ ప్రధాన కార్యదర్శి శుక్రవారం రెడ్డికి అందజేశారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయం ఇదని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిటీ నాయకులు శుక్ర వర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మల్లేష్ గౌడ్, బుచ్చయ్య, వెంకటరామిరెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణరెడ్డి, బాలయ్య, గంధం ఆనంద్, గంధం శ్రీనివాస్, సర్వేశ్వరప్ప, మెకానిక్ గోపాల్ రెడ్డి, చెరుకు శివ, కార్తీక్ గౌడ్, గంగమోని సత్తయ్య, ముదిరాజ్ సంఘం నేత మంగ మధు, శంకరయ్య యాదవ్, కట్ట శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు..
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >