Posted on 2024-08-30 16:50:38
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కలిసిన రెడ్డి సేవా సమితి నాయకులు
షాద్ నగర్ లో రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ విగ్రహానికి శ్రీకారం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, విద్యా వికాసానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ అని ఆయన సేవలను భవిష్యత్తు తరాలు స్మరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" పిలుపునిచ్చారు.
శుక్రవారం ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో రెడ్డి సేవా సమితి షాద్ నగర్ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి మహిళా సంఘం అధ్యక్షురాలు అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు చెంది మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, యువ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. పట్టణంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి కొత్వాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం తరఫున సహకరించేందుకు రెడ్డి సేవ సమితి నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో గౌరవం అని అన్నారు. రెడ్డి సేవా సమితి ఏర్పాటు చేయ విగ్రహానికి ధనవంతు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కొత్వాల్ (నేటి నగర పోలీస్ కమీషనర్ స్థాయి పదవి)గా పనిచేసిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి గొప్ప దాతగా, ప్రజాసంక్షేమానికి పాటుపడ్డ వ్యక్తిగా ప్రతిష్ఠ పొందారని అన్నారు. తెలంగాణలోని రెడ్డి కులస్తులైన విద్యార్థులతో పాటే సమాజంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా చదువుకునేందుకు సహకారంగా ఉండాలని, ఆనాటి నైజాం రాష్ట్రంలో విద్యావికాసానికి ఉపకరిస్తుందని భూమి విరాళం ఇచ్చి రెడ్డి హాస్టల్‌ను ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. రెడ్డి హాస్టల్‌గా పేరుపొందిన హైదరాబాద్ రెడ్డి విద్యార్థి వసతిగృహం నిజాం పరిపాలనకాలం నాటి తెలంగాణలో విద్యారంగం, సాంస్కృతికరంగాలకు విలువైన సేవ చేసిన సంస్థ అని కొనియాడారు. హైదరాబాద్ నగర కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి రెడ్డి హాస్టల్‌ను తన వితరణతో ఏర్పాటుచేశారనీ కొనియాడారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు లట్టుపల్లి మోహన్ రెడ్డి చరిత్ర గురించి వివరిస్తూ ఈ సంస్థలో వసతిపొంది విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు తదనంతర కాలంలో రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, సంగీతాది రంగాల్లో సుప్రసిద్ధులైనారని, కుల ప్రాతిపదికన కాకుండా అన్ని వర్గాల విద్యార్థులకు ఈ సంస్థ ద్వారా వసతి కల్పించి విద్యకు దోహదం చేశారని గుర్తు చేశారు. రెడ్డి హాస్టల్ సాంస్కృతిక కళాకేంద్రంగా కూడా విరసిల్లిందని, రెడ్డి హాస్టల్లోనే పలు సాంస్కృతిక సంస్థలు ఊపిరిపోసుకున్నాయనీ అన్నారు.
విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
షాద్ నగర్ లో ప్రముఖ విద్య వైతాళికుడు రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి కొత్వాల్ విగ్రహానికి శ్రీకారం చుట్టే ప్రక్రియలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి తదితర నాయకులు విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఇదివరకు ఏర్పాటుచేసిన ప్రముఖుల విగ్రహాల పక్కనే రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుంధతి, యువజన సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, సేవా సమితి నాయకులు లట్టుపల్లి మోహన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, చెంది మహేందర్ రెడ్డి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >