Posted on 2023-11-04 18:45:50
డైలీ భారత్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో, సీట్ల కేటాయింపులో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది.ఇక, తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను రెండు స్థానాల్లో బరిలో నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కాగా, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానం రేవంత్‌ను పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల ఎనిమిదో తేదీన రేవంత్ కామారెడ్డి(kamareddy)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈనెల ఆరో తేదీన కొడంగల్‌లో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో రేవంత్ భేటీ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న స్థానం నుంచి రేవంత్ బరిలో దిగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు.. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఇక, షబ్బీర్ అలీ నామినేషన్‌కు రేవంత్ వెళ్లనున్నారు. అయితే, సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలో ఉండటం షబ్బీర్ అలీ అక్కడ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలసిందే.
ఏసీబీకి చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్ అధికారులు
Posted On 2026-04-01 15:43:24
Readmore >
ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-01 14:26:38
Readmore >
ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-01 13:21:20
Readmore >
వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-01 12:55:54
Readmore >