| Daily భారత్
Logo




ముకేశ్ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.

News

Posted on 2023-11-04 19:55:11

Share: Share


ముకేశ్ అంబానీకి బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.

డైలీ భారత్: ముకేశ్ అంబానీ సిమ్ కార్టు మొదలు డిజిటల్ రంగం వరకూ.. ఆయిల్ ఉత్పత్తుల నుంచి ఐస్ క్రీం సంస్థల వరకూ అన్నింటా తానే దేదీప్యమానంగా వెలుగొందుతూ భారత కుబేరుల జాబితాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.అయితే గత కొన్ని రోజులుగా వరుస మెయిల్స్ ద్వారా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు కొందు ఆకతాయిలు. డబ్బులు ఇవ్వాలని లేకుంటా చంపేస్తామని సందేశాన్ని పంపించారు. మొదట దీనిని లైట్‌గా తీసుకున్నారు. అయితే క్రమంగా మెయిల్స్ ద్వారా బెదిరింపుల తీవ్రత పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు తెలంగాణకు చెందిన యువకుడిని ముంబైలోని గామ్‌దేవి పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. షాదాబ్ ఖాన్ అనే మారుపేరుతో నిందితుడు గణేష్ రమేష్ వనపర్ద్ అనే 19ఏళ్ల కుర్రాడు తొలిసారిగా అక్టోబర్ 27న ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ పంపాడు. 20 కోట్ల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే, మేము నిన్ను చంపుతాము అని సందేశాన్ని పంపాడు. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు” అని రాశాడు. దీనిపై స్పందించని ముకేశ్ అంబానీకి ఇమెయిల్ బెదిరింపుల తీవ్రత పెరిగింది.

అతను ఇమెయిల్‌లు పంపుతూనే ఉన్నాడు. మరోసారి రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు. మరోసారి ప్రాణాలు తీస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు.ఇలా వరుస సందేశాలతో నిందితులు ఈ డిమాండ్‌ని రెట్టింపు చేస్తూ వచ్చాడు. ఈ వారంలో రూ. 400 కోట్ల డిమాండ్ వద్ద ఆగిపోయాడు. ఈ 19 ఏళ్ల యువకుడి ఐపీ అడ్రస్‌లను మహారాష్టరాలోని గాందేవి పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి నవంబర్ 1 వరకు పోలీసు కస్టడీకి పంపారు. బెదిరింపు ఇమెయిల్‌లను పోలీసులు చాలా చిన్నవిగా భావిస్తారు. అయితే ఈ ఇమెయిల్‌ ద్వారా పెద్ద ఎత్తున వరుసగా బ్లాక్‌మెయిల్ మెసేజ్‌లు పంపడంతో రంగంలోకి దిగిన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అయితే ఒక అనాలోచిత చిలిపి పనిపై ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >