Posted on 2023-11-04 15:40:43
పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయకుంటే ఉద్యమం ఉధృతం
డైలీ భారత్, ఢిల్లీ : ఢిల్లీలో లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ తెలిపారు.
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.జి.ఈ.ఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ (సీసీజీఈడబ్ల్యూ), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్.టీ.ఎఫ్.ఐ), నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్సీసీపీఏ), సీ.సీ.జీ.జీ.ఓ.ఓ, ఎఐఎస్‌జీపీఎఫ్ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన చేతావనీ ర్యాలీలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలను ఆపాలని, ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలని, 8వ కేంద్ర వేతన కమీషన్ ను నియమించాలని, 18 నెలల డి.ఏ/ డి.ఆర్ బకాయిలను విడుదల చేయాలని, కారుణ్య నియామకాలకు అడ్డంకులను తొలగించాలని, పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాలని నినదించారు. ”ఎన్పీఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పునరుద్ధరించాలి, ఎన్‌ఈపీని వెనక్కి తీసుకోవాలి” అంటూ డిమాండ్ చేస్తూ ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేబూని దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎన్.జీ.ఓ అసోసియేషన్లు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టి.ఎఫ్), ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్ (టాప్రా), పోస్టల్ తదితర సంఘాల నుండి వేలాది మంది ఢిల్లీ భారీ ర్యాలీలో పాల్గొని తమ న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెతో సహా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎన్.పి.ఎస్ ను రద్దు చేసి, సీ.సీ.ఎస్ పెన్షన్ రూల్స్, 2021ను అందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సిబ్బందికి వర్తింప చేసి పాత పెన్షన్ స్కీమును ( ఓ.పి.ఎస్) పునరుద్ధరించాలని, క్యాజువల్, కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్, డైలీ వేతనాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్ చేయాలని, వేతన సవరణ జరపాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ,పెన్షన్ ఫండ్ ప్రయివేటీకరణలను మానుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.
వి. కృష్ణ మోహన్
9182189533, 9440668281 హైదరాబాద్ kmdrdo@gmail.com
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >