| Daily భారత్
Logo




ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి

News

Posted on 2024-08-12 10:30:49

Share: Share


ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి..  విద్యుదాఘాతానికి గురై మృతి

డైలీ భారత్, ఖమ్మం: మొబైల్ మాయలో పడి ఏం చేస్తున్నాం అన్న సంగతి కూడా కొందరు మరిచిపోతారు.  ప్రస్తుతం ఒక ఘటన కూడా ఇలాంటిదే. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు కుటుంబంతో నివసిస్తున్నాడు. వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయాలనుకొన్నాడు.

ఇంతలో మహేశ్ మొబైల్ రింగ్ అయ్యింది. దీంతో ఒక వైపు ఫోన్ లో మాట్లాడుతున్న మహేశ్  బకెట్ నీటిలో బదులు హీటర్ ను తన చంకలో పెట్టుకున్నాడు. తానేం చేస్తున్నానో మరిచిపోయి హీటర్ స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో భయపడిపోయిన భార్య దుర్గాదేవి.. మహేశ్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >