Posted on 2024-08-10 13:24:34
చేగూరు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రతి క్రీడాకారుడు క్రీడలను ఆకలింపు చేసుకొని ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాలన్న సంకల్పంతోనే క్రీడలను నిబద్ధతతో ఆడాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం నందిగామ మండలం చేగూరు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంటును స్థానిక ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. టోర్నమెంటు నిర్వాహకులు బంటారం మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంటు కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ వాలీబాల్ను సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిగతంగా శరీర ధృఢత్వానికి, మానసిక ఒత్తిడి లేకుండా చేస్తాయని, చిత్తశుద్ధితో క్రీడలను అడితే నైపుణ్యంతో పాటు మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రపంచ స్థాయిలో ఆడాలంటే గుర్తింపు రావాలంటే అనితరమైన సాధన చేయాలని క్రీడాకారులకు సూచించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడా పాలసిని కొత్తగా రూపొందించిన ప్రభుత్వం యువతను భావితరాలకు గొప్ప క్రీడాకారులుగా అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో క్రీడాకారుల అభ్యున్నతి కోసం స్టేడియాల మంజూరుకు విన్నవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఏ ప్రాంతానికైనా క్రీడలే మంచి పేరు తెస్తాయన్నారు. క్రీడలకు సంబంధించి ప్రభుత్వం కోరిన స్థలాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొందుర్గు ఉమ్మడి మండలంలో స్టేడియం నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు మార్గాలను అవలంభించకుండా ఎల్లప్పుడు మంచివైపు దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ మధ్య సమాజంలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు అయ్యారని, ఇది భావితరాలకు నష్టం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యువతకు దిశానిర్దేశం చేసేవిధంగా క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తున్నామని యువత క్షణికావేశాలకు లోనుకాకుండా వక్రమార్గాలను అనుసరించకుండా నీతి, నిజాయితీతో ఉండాలని కోరారు. ఈ టోర్నమెంటును ప్రారంభించడానికి ఆహ్వానించిన నిర్వా హకులు బంటారం మల్లేష్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మండల అధ్యక్షులు జంగ నర్సింహ్మ యాదవ్, మాజీ ఎంపీటీసీ కొమ్ముకృష్ణ, కుమార్ గౌడ్, చంద్రపాల్, మాజీ ఎంపిటీసీలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >