| Daily భారత్
Logo




మహిళపై లాఠీ చేసుకున్న పోలీసులు

News

Posted on 2024-08-10 13:20:06

Share: Share


మహిళపై లాఠీ చేసుకున్న పోలీసులు

డైలీ భారత్, మెట్పల్లి: జిగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఓ మహిళను గౌరవించకుండా దురుసుగా ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకొనే ఖాకీలు ఇలా ప్రవర్తించడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పట్ల ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ అక్కడే ఉన్న ఓ వ్యక్తితో గొడవడుతోంది. ఆ సమయంలో అక్కడ వారితో మాట్లాడుతున్న ఏఎస్‌ఐ అనుసరించిన తీరు ఇప్పుుడ వివాదాస్పదంగా మారింది. 

వ్యక్తితో గొడవపడుతున్న మహిళను సముదాయించాల్సింది పోయి ఆమెపై లాఠీ ఎత్తారు ఏఎస్‌ఐ. ఆయనకు మరో కానిస్టేబుల్ వంతపాడారు. ఇద్దరూ ఆమెను చేతులతో పక్కకు నెట్టేసి లాఠీతో అదిలించారు

లాఠీ తీసుకొని ఆమెను కొడుతూ మహిళను అక్కడి నుంచి వెళ్లగొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఏఎస్‌ఐ ఆమెను లాఠీతో కొడుతుంటే అప్పుడే వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఆమెను పక్కకు నెట్టేస్తున్నాడు. ఆమె ఏదో చెబుతున్నా వారి పట్టించుకోవడం లేదు. 

వారితో ఉన్న మహిళా హోంగార్డుతో చెప్పి ఆమెను సముదాయించాల్సింది పోయి వారే రంగంలోకి దిగి మహిళను నెట్టేయడం, కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోను అక్కడే ఉన్న కొందరు స్థానికులు షూట్ చేసి వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తున్నారు. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రజలను రక్షించాల్సి రక్షకబటులే ఇలా మారడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. బహిరంగ ప్రదేశంలోనే పోలీసులు ఇలా ఉంటే స్టేషన్‌లోపల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న ఉన్నతాదికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం అవేమీ పట్టడం లేదని విమర్శిస్తున్నారు. మనుషలంటే లెక్కలేదని స్ట్రీలనే గౌరవం లేకుండా ఇలా లాఠీతో కొట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అక్కడ ఏం జరిగి ఉన్నప్పటికీ అలా చేయడం తప్పని అంటున్నారు

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >